ఇటీవల కాలంలో తెలుగు
సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్క
హీరో కూడా పాన్
ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. అక్కడ మంచి
సక్సెస్ సాధిస్తే వారికి భారీ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటుగా వారికి మంచి
మార్కెట్ కూడా ఏర్పడుతుంది. ఆ విధంగా ఇప్పుడు అందరు హీరోలు పాన్
ఇండియా సినిమాలు చేయాలనుకోవడం విశేషం. అయితే కొంతమంది హీరోలకు ఈ సినిమాలు ఏమాత్రం కలిసి రావటం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో వారిలో అలాంటి
సినిమా చేయాలా వద్దా అన్న ఆలోచన కలుగుతుందట.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి
సక్సెస్ కలిగి ఉన్న హీరోలలో ఇప్పుడు ఇంకొక రకమైన భయం ఏర్పడుతుంది. దానికి కారణం ఒక ప్లాన్
ఇండియా సినిమా సూపర్ హిట్ అయితే ఆ తర్వాత వచ్చే పాన్
ఇండియా సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలి. వాస్తవానికి అంతకు మించిన స్థాయిలో ఉంటేనే రెండో పాన్
ఇండియా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఆ విధంగా ఇప్పుడు రెండవ పాన్
ఇండియా సినిమాల విషయంలో హీరోలు ఆలోచన చేసి జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు.
ఈ విషయంలో
ప్రభాస్ ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాడని చెప్పాలి. ఆయన
బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి
మార్కెట్ కలిగి ఉండి తన ప్రతి
సినిమా కూడా పాన్
ఇండియా వైడ్ గా రావాలనే డిమాండ్ నెలకొనేలా చేసుకున్నాడు. అయితే ఆ విధంగా వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం అరవించకపోవడంతో ఇప్పుడు చేయబోయే సినిమాలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే ఆయన రాబోయే పాన్
ఇండియా సినిమాల విషయంలో ఎంతో
ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నాడు. మరి ఈ సినిమాలైనా ఆయనకు
బాహుబలి లాంటి భారీ విజయాన్ని తెచ్చిపెడతాయా అనేది చూడాలి.