కొంతమంది యువ హీరోలు ట్రాక్ తప్పుతూ ఉండడం సినిమా విశ్లేషకులతో పాటు సినిమా ప్రేమికులకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు. మంచి టాలెంట్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు అన్న సింపతి ఉండటంతోనే వారిపై ఈ విధమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణం అవుతుంది. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు సంతోష్ శోభన్. ఆయన కెరియర్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సినిమా ఏక్ మినీ కథ.

ఈ సినిమాలో సంతోష్ శోభన్ నటించిన తీరుకు ప్రేక్షక లోకం మొదలైపోయింది. ఇంత సింపుల్ గా నటించిన ఈ హీరో తప్పకుండా మంచి సినిమాలు పెడితే పెద్ద హీరో అవుతాడని అప్పుడే ప్రతి ఒక్కరు అనుకున్నారు అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఇప్పుడు సంతోష్ శోభన్ మంచి సినిమాలను చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు.

ఇప్పుడు రెండు మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆయనకు అవి ఆ సినిమాలు భారీ విజయాలను తెచ్చిపెడతాయా అనేది చూడాలి. ఇకపోతే కిరణ్ అబ్బవరం కూడా ఇటీవలే ఓ సినిమా తో వచ్చాడు. అది ఫ్లాప్ అయ్యింది. మంచి సినిమాలను ఎంచుకునే విషయంలో పొరపాట్లు చేయడం ఆయనకు ఈ వరుస ఫ్లాపులు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విజయం అందుకోకపోవడంతో ఆయనను భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన మంచి సబ్జెక్టులను ఎంచుకొని ప్రేక్షకులను అలరిస్తే మంచిదని చెప్పాలి. ఇప్పుడు వీరిద్దరూ కూడా ఒక మంచి హిట్ వస్తేనే వారికి భవిష్యత్తులో మంచి హీరో అయ్యా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మరి వీరితో పాటు మరికొంతమంది హీరో లు కూడా సినిమాలు ఎంపిక చేసుకునే క్రమంలో ఇబ్బందులకు పడుతున్నారు. మరి వారు ఎప్పుడు మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: