మోస్ట్ టాలెంటెడ్ మరియు మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత 'శాకుంతలం' అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ కి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. 

ఇది ఇలా ఉంటే నిన్న శాకుంతల మూవీ యూనిట్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుండి బిగ్ అనౌన్స్మెంట్ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉదయం శాకుంతలం మూవీ యూనిట్ ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా శాకుంతలం మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: