శ్రీకాంత్ హీరోగా సంచిత బసు హీరోయిన్ గా ఫస్ట్ డే ఫస్ట్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి జాతి రత్నాలు మూవీ కి దర్శకత్వం వహించినటు వంటి అనుదీప్ కే వీ కథ మరియు మాటలను అందించగా వంశీధర్ గౌడ్ ,  లక్ష్మీనారాయణ  ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2 సెప్టెంబర్ 2022 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది.  

మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టు కునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది. ఇలా ప్రేక్షకులను థియేటర్ లలో ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయినా ఫస్ట్ డే ఫస్ట్ మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుండి అనగా సెప్టెంబర్ 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ మూవీ ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కి రధన్ సంగీతాన్ని అందించగా , శ్రీజ ఏడిద ఈ మూవీ ని నిర్మించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: