సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమా చాలా రోజులుగా విడుదలకు నోచుకోకపోవడంతో ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు చాలా మంది వ్యక్త పరిచారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చ ల్ చేయడంతో ఈ సినిమా విడుదలవుతుంది అనే అంచనాలను ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఈ సినిమా డిసెంబర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందని వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఈ సినిమా నవంబర్ లోనే విడుదల కాబోతుంది అని చిత్ర బృందం అధికారిగా ప్రకటన ఇచ్చింది. నవంబర్ రెండవ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా ఈ సినిమా బృందం ఒక అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. మరి చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న ఈ మైథాలాజికల్ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగు సినిమా పరిశ్రమలో గుణశేఖర్ సినిమాలకు ఎంతో మంచి పేరు ఉంది. పెద్దపెద్ద హీరోలతోనే సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇటీవల కాలంలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్నాడని చెప్పాలి.

ఆయన సినిమాలు బాక్స్ ఫీస్ వద్ద తేలిపోవడంతో ఒక మంచి సినిమా ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నో అంచనాలను పెట్టుకొని చేసిన ఈ శాకుంతలం సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. తన గత సినిమాల లాగానే భారీ సెట్స్ తో సినిమాలను రూపొందించే ఈ దర్శకుడు ఈ సినిమాను రూపొందించడంలో అదే తరహా విధానాన్ని చూపించాడు. ఆ విధంగా ఇప్పుడు గుణశేఖర్ మంచి కం బ్యాక్ చేయాలని చాలామంది కోరుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: