మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఇటీవల ఒక్క హిట్ కూడా పడ లేదన్న విషయం తెలిసిందే..కాస్త టైం తీసుకొని ఇప్పుడు మరో సినిమాను చేస్తున్నారు..చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్‌. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ ను మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న లూసిఫర్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండడం, చిరంజీవి డిఫ్రంట్‌ లుక్‌లో కనిపించడంతో పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


అంతేకాకుండా నయనతార, సత్యదేవ్‌, సునీల్‌, అనసూయలతో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలో నటించడంతో అందరి దృష్టి ఈ పై పడింది.ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఈ అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే చిరంజీవితో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సెన్సార్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను దర్శకుడు మోహన్‌ రాజా అభిమానులతో షేర్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.


ఈ విషయమై దర్శకుడు ట్వీట్ చేస్తూ.. 'ఈ సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా సెన్సార్‌ సభ్యుల నుంచి ఈ కు మంచి స్పందన వచ్చింది' అని రాసుకొచ్చారు..దసరా బరిలో దిగుతున్న సినిమాలలో మెగాస్టార్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తారో తెలయాలంటే అక్టోబర్‌ 5 వరకు వేచి చూడాల్సిందే.ఇదిలా ఉంటే ఈ విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న ఈ ఓటీటీ హక్కులతో అందరి దృష్టిని ఆకర్షించింది. గాడ్‌ ఫాదర్‌ ఓటీటీ హక్కులకు ఏకంగా రూ. 57 కోట్లుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తెలుగు, హిందీ హక్కుల కోసం ఈ మొత్తాన్ని చెల్లిస్తుందని సమాచాచరం. విడుదలకు ముందే రికార్డుల వేట మొదలవడంతో మెగా ఫ్యాన్స్‌ సంతోషంలో మునిగి తేలుతున్నారు..మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: