బుల్లితెర ప్రేక్షకులందరికీ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా ప్రేక్షకులు అందరూ కూడా వీక్షిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏ కంటెస్టెంట్స్ ఎలా పర్ఫామెన్స్ చేస్తున్నారు అన్న విషయాన్ని గమనిస్తూ ఇక తమ అభిమాన కంటెస్టెంట్ కి సోషల్ మీడియా వేదికగా ఓట్లు వేసి మద్దతు తెలుపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో భాగంగా కొంతమంది కంటస్టెంట్ల తీరు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది.


 ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన గీతు రాయల్ వ్యవహార శైలి అటు ప్రేక్షకులకు కాస్త నచ్చడం లేదు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఒక వర్గం ప్రేక్షకులకు గీతు రాయల్ ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని అనిపించినప్పటికీ మరో వర్గం ప్రేక్షకులకు మాత్రం గీతు రాయల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కాస్త ఓవరాక్షన్ చేస్తుంది అంటూ ఒక భావన కలిగింది అని చెప్పాలి. ఎందుకంటే బిగ్బాస్ మొదలైన మొదటి ఎపిసోడ్ నుంచి చూసుకుంటే గీతు రాయల్ కేవలం కంటెంట్ ఇవ్వడానికి మాత్రమే హౌస్ లోకి వెళ్ళింది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంది. హౌస్ లో ఎవరు గొడవపడిన అందులో గీత రాయల్ పాత్ర ఉంటుంది. ఆమెకు సంబంధం లేకపోయినా ఏదో ఒక విధంగా కల్పించుకుంటుంది.


 తద్వారా ఎక్కువ కంటెంట్ గీతు రాయల్ కు ఉండే విధంగా చేసుకుంటుంది. ఇక ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో కూడా శ్రీహాన్ ఇనయ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక వీరిద్దరూ కూడా ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. దీంతో హౌస్ మొత్తం వాడి వేడిగా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆ గొడవకు అస్సలు సంబంధం లేని గీతూ రాయల్ ఏకంగా వారి మధ్యలోకి వెళ్లి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం చేసింది. ఏదో పాటలు పాడుతూ వింతగా డాన్స్ చేసింది. ఇది చూసిన ప్రేక్షకులు గీతు రాయల్ ఓన్లీ కంటెంట్ ఇవ్వడం కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్లుంది అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: