ఇటీవల సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం..పాన్ ఇండియా స్టార్ హీరో అయిన  ప్రభాస్ ని ఎంతగానో బాధించిన సంగతి తెలిసిందే.ఆయన పెదనాన్న మరణాన్ని తట్టుకోలేక ప్రభాస్ కన్నీరు పెట్టుకోవడం జరిగింది.ఇక కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుకున్నాడు.అయితే  ఇండియాలోనే ఏ ఇండస్ట్రీలో హీరోలకు లేని ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ కి ఉంది. అంతేకాదు ఇండియాలో కెరియర్ పరంగా ప్రెజెంట్ ప్రభాస్ మంచి స్థానంలో ఉన్నాడు.

ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా భారీ ప్రాజెక్టులే.ఇక  ఇటువంటి తరుణంలో కృష్ణంరాజు మరణంతో కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెబుతున్న ప్రభాస్ మళ్లీ సినిమా సెట్స్ లోకి రావాలంటే నెల టైం పట్టే అవకాశాలున్నట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి.అయితే  అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిన  ప్రభాస్.. కృష్ణంరాజుకు సంబంధించి 11 రోజుల కార్యం పూర్తి కావడంతో..”సలర్” సెట్ లోకి అడుగుపెట్టడం జరిగిందట. ఇక రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేయడంతో షూటింగ్ ఎక్కడ ఆగిపోకుండా సినిమా యూనిటీ పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకొని 

వెంటనే షూటింగ్ లో ఇటీవల ప్రభాస్ జాయిన్ అయ్యారు.ఇదిలా ఉంటే  ఇక బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అక్టోబర్ రెండవ తారీకు విడుదల చేస్తున్నారు అని బయట ప్రచారం జరుగుతుంది. అయితే  ఇక ఈ రోజు అధికారిక ప్రకటన సినిమా యూనిట్ నుండి రానున్నట్లు సమాచారం.ఇక  వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సన్నాన్ ఇంకా సైఫ్ అలీ ఖాన్ పలువురు బాలీవుడ్ నటి నటులు నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: