కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్ కానీ ఏ నిర్మాత కానీ ముందుకు అయితే రాలేదు.. అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది.


అదే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.


ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని కూడా ఎదురు చూస్తున్నారు.


ఇక మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతున్న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీగా ప్రొమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా మణిరత్నం చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిపాడు.. మణిరత్నం త్రిష మరియు ఐశ్వర్య రాయ్ లను షూట్ సమయంలో అస్సలు మాట్లాడుకోవద్దని చిన్న సైజ్ వార్ణింగ్ కూడా ఇచ్చాడట.


అందుకు కారణం కూడా మణిరత్నం ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. త్రిష, ఐశ్వర్య మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి అంటే వారిద్దరూ ఎదురు పడ్డ సీరియస్ గా ఉండాలి.. అయితే వీరికి అలా సెట్ లో ఉండడం కష్టం అవ్వడంతో ఆ సీన్స్ మధ్య సీరియస్ నెస్ ను కనిపించేలా చేయడానికి ఇబ్బంది పడ్డారని మణిరత్నం తెలిపారట.


  అందుకే షూట్ జరుగుతున్న అన్ని రోజులు వారిని ఒకరిని ఒకరు కలవకుండా ఉండాలని వార్ణింగ్ ఇచ్చాడని అన్నారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారిద్దరి మధ్య సీరియస్ రాదని అందుకే అలా చెప్పానని చెప్పుకొచ్చాడట... మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.. 1000 కోట్ల టార్గెట్ అంటూ చెబుతున్న మేకర్స్ ఈ సినిమాతో ఎంత వసూలు చేస్తారో మరి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: