సాధారణంగా ఒక సినిమాలో ఒక హీరోను లేదా హీరోయిన్ ను ముందుగా అనుకొని ....వాళ్ళతో కొద్దిరోజులు షూటింగ్ చేస్తారు... అయితే తరువాత వాళ్ళను మార్చి ఆ ప్లేస్‌లోకి కొత్త హీరో, హీరోయిన్లను తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి.ఇక ఆ హీరో, హీరోయిన్లత దఓర్శకులు లేదా నిర్మాతలకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన లేదా హీరో హీరోయిన్ల జంట సరిగా మ్యాచ్ కాలేదని దర్శకులు లేదా నిర్మాతలు భావిస్తే వాళ్ళను మార్చేస్తూ ఉంటారు.అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ సినిమా హీరోయిన్ విషయంలోనూ ఇదే జరిగింది అట.ఇక ఈ సినిమా కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇకపోతే  ప్రభాస్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య 4 - 5 రోజులు పాటు షూటింగ్ కూడా చేశారు. ఆ ఫుటేజ్ చూశాక హీరో ప్రభాస్ తో పాటు నిర్మాతకు ఏదో అసంతృప్తిగా ఉందట. అయితే హైట్‌గా ఉన్న ప్రభాస్ పక్కన బక్క పల్చగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఏ మాత్రం సరైన జోడిగా సూట్ కావటం లేదని భావించారట.ఇక  అప్పటికే కొన్ని సీన్లు షూట్ చేయడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ను కొనసాగించాలా వద్దా ? అన్న డైలమాలో దర్శకు, నిర్మాతలు ఉన్నారట. డార్లింగ్ మేకర్లు, హీరో ప్రభాస్ చర్చించుకుని ఆమెకు బదులుగా కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. అయితే చివరకు వాళ్ళు ఇదే విషయాన్ని రకుల్ ప్రీత్‌తో చెప్పేశారట.

ఇక రకుల్ ప్రీత్ కూడా కన్విన్స్ అయ్యి సినిమా నుంచి తప్పుకునేందుకు ఓకే చెప్పిందట.ఇదిలావుంటే  అప్పుడు ప్రభాస్‌కి జోడిగా ఎవరిని తీసుకోవాలని అనుకున్నప్పుడు పలువురు హీరోయిన్ల పేర్లు చర్చకి వచ్చాయి.ఇక  కాజల్ అయితే ప్రభాస్ కి జోడీగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని అందరూ భావించారు.అంతేకాదు  కాజల్.. ప్రభాస్ పక్కన హైట్, వెయిట్ కరెక్ట్ గా ఉంటుందని అనుకున్నారట.అయితే వెంటనే కాజల్‌ను అడగడంతో చాలా హ్యాపీగా ప్రభాస్ పక్కన చేసేందుకు ఓకే చెప్పేసిందట. ఇక అలా డార్లింగ్ సినిమాలోకి కాజల్ వచ్చి చేరింది. ఇకపోతే ఆ తర్వాత కూడా ప్రభాస్ పక్కన కాజల్ మరోసారి `మిస్టర్ పర్ఫెక్ట్` సినిమాలో కూడా నటించింది.ఇక్కడ  విచిత్రం ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా నటించినా ప్రభాస్ పక్కన మాత్రం ఆమె మళ్లీ నటించలేకపోయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: