బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే  ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటి మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.అంతేకాదు  ఖచ్చితంగా ఈసారి ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలు హిట్ అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.ఇక  అవసరమైతే రీషూట్ కి అయినా వెళదామని ప్రభాస్ నిర్మాతలకు చెబుతున్నాడట.ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ టెన్షన్ పెట్టే ఒక విషయం ఏమిటంటే ఆయన మారుతీ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే.

ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సినిమా అయితే ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు భారీగా జరుగుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతీ లాంటి చిన్న డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయడం ఎలా అని ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఇక మారుతికి గత ట్రాక్ రికార్డు చూసుకుంటే మహానుభావుడు సినిమా తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. డైరెక్టర్ కి ప్రభాస్ ఎలా డేట్స్ ఇచ్చాడా అని వారంతా టెన్షన్ పడుతున్నారు.ఇక  ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పెద్ద బడ్జెట్ తో కాకుండా తక్కువ బడ్జెట్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశారని

 ముందు నుంచి ప్రచారం జరిగింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఈ సినిమా గురించి తెర మీదకు వచ్చింది.ఇక  అదేమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ప్రభాస్ స్టార్ డమ్ తో ఎలాగో తెలుగులో సహా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోని కూడా రంగంలోకి తీసుకొస్తున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే కచ్చితంగా మారుతి సినిమా అంటే అది కాస్త కామెడీ యాంగిల్ లో సాగుతూ ఉంటుంది.ఇక  ప్రభాస్ హీరోగా కామెడీ యాంగిల్ లో వచ్చిన సినిమాలు గతంలో సూపర్ హిట్ అయ్యాయి.  మారుతీ డైరెక్షన్లో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.సినీ విశ్లేషకులు మాత్రం చాలా ఆసక్తికరంగా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు.అయితే  మారుతీ లాంటి డైరెక్టర్ ప్రభాస్ ను ఎలా డీల్ చేయబోతున్నాడు అనే విషయం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: