నలభై ఏళ్లు దగ్గరపడుతున్న చెక్కు చెదరని అందంతో మాయ చేస్తోంది అందాల నటి త్రిష. ఒకవైపు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే, మరోవైపు కుర్ర హీరోల పక్కన సైతం నటిస్తోంది.
త్రిషకు తమిళ్ లోనే కాకుండా టాలీవుడ్ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు వయసు పెరుగుతున్నా.. స్వీట్ సీక్స్ టీన్ లాగా అభిమానులను ఆకట్టుకుంటోంది. నిన్న హైదరాబాదులో జరిగిన ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తెలుగు ప్రేక్షకులు చూశారు. బ్లాక్ కలర్ శారీలో ఆమె నల్ల గులాబీలా మెరిసిపోయింది.

నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్ గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్ లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, త్రిషనే అందరినీ ఆకర్షించింది. చూసిన వాళ్లంతా త్రిష మరింత అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘కుందవై’ పాత్ర హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో చేతి నిండాసినిమా లతో అగ్రకథానాయికగా దూసుకుపోయింది…

నటనపరంగానూ మంచి ప్రశంసలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నది.. ఇప్పటికీ లతో బిజీగానే ఉంది. గత కొంత కాలంగా లకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే తమిళ్ చిత్రం 96తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించనుంది. అన్ని కార్యక్రామాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్లను ప్రారంభించిన చిత్రయూనిట్.. శుక్రవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో.. చిరునవ్వులు చిందిస్తూ వేదికపై సందడి చేసింది. బ్లాక్ శాలరీలో నల్ల గులాబీలో మెరిసిపోయింది. దీంతో అందరి చూపులు త్రిషపై ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక వేదికపై అటు ఐశ్వర్య రాయ్, త్రిష ఇద్దరు కలిసి ఉండడం చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదని అంటున్నారు. ముఖ్యంగా త్రిష మరింత అందంగా కనిపిస్తుందని.. దీంతో ఆమెకు తిరిగి అవకాశాలు క్యూ కట్టే అవకాశముందంటున్నారు అభిమానులు. నాలుగు పదుల వయసులోనూ పెళ్లికి దూరంగా ఉంటూ.. మరింత అందంగా తయారైన త్రిషను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న పొన్నియిన్ సెల్వన్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి…

మరింత సమాచారం తెలుసుకోండి: