స్టార్ హీరో బాలకృష్ణ కు రెండు తెలుగు రాష్టాల తో పాటు దేశవిదేశా ల్లో అభిమానులు ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ల్లోకి, రాజకీయా ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఈ రెండు రంగాల లో సక్సెస్ సాధించడం గమనార్హం.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై బాలయ్య ఘాటుగా స్పందించడం లో తప్పు లేదు. అయితే విమర్శలు ఒకింత హద్దులు దాటాయని కామెంట్లు వ్యక్తమవు తున్నాయి.

ఎవరిని కుక్కలు అంటున్నావు బాలయ్యా అంటూ కొంతమంది నెటిజన్లు ఘాటు గా ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రాన బాలయ్య ఇంత ఘాటు గా స్పందించాల్సిన అవసరం ఉందా అని మరి కొందరు ప్రశ్ని స్తుండటం గమనార్హం. బాలయ్య హీరో కావడం తో పాటు ఎమ్మెల్యే కూడా అని హుందా గా స్పందిం చాల్సిన బాలయ్య ఈ విధంగా స్పందించడం ఏమిటని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ నేతలు కూడా బాలయ్య ను, బాలయ్య కుటుంబ సభ్యుల ను ఇదే తరహా లో విమర్శిస్తే ఎలా ఉంటుందని కొంత మంది సందేహాల ను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాలయ్య టీడీపీ నేతల మెప్పు పొందడాని కి ఈ తరహా లో విమర్శలు చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. బాలయ్య ను ఆయన అభిమానుల లో ఎంతో మంది ఆదర్శం గా తీసుకుంటారు.

బాలయ్య నే అధికారం లో ఉన్న నేతల ను కుక్కలు అంటూ విమర్శలు చేస్తే ఆయన అభిమానులు సైతం ఇదే తరహా లో కామెంట్లు చేసే ఛాన్స్ ఉంది. కొంత మంది ట్రోల్ చేస్తున్నా బాలయ్య స్పందన తో పోల్చి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించిన తీరు బాగుందని చెప్పవచ్చు. హద్దులు దాటిన విమర్శ లు బాలయ్య లాంటి నేతల కు ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: