టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన నటించిన సినిమాలలో కరోనా తర్వాత విడుదలై మంచి విజయం సాధించుకున్న సినిమాలలో లవ్ స్టోరీ మరియు బంగార్రాజు ఒకటి.


ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ.ఈ సినిమా కథ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.


ఇక ఈ సినిమా విడుదల ఈ నేటికీ ఏడాది పూర్తి కావడంతో ఈ సినిమా గురించి నాగచైతన్య స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య స్పందిస్తూ ఇలాంటి స్పెషల్ సినిమాని నాకు అందించిన చిత్ర బృందానికి ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా తనకు ఎన్నో విషయాలను నేర్పించిందని,లవ్ స్టోరీ సినిమా జ్ఞాపకాలు తనకు ఎప్పటికీ గుర్తు ఉంటాయని ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.


 


ప్రస్తుతం నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా గురించి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వంటి క్లిష్ట సమయంలో థియేటర్లు తెచ్చుకున్నప్పటికీ పెద్ద సినిమాలు విడుదలకు సాహసం చేయలేదు అలాంటి సమయంలో లవ్ స్టోరీ సినిమా థియేటర్లో విడుదలయి ఎంతో మంచిది విజయాన్ని సొంతం చేసుకుని ఎన్నో సినిమాలకు భరోసాగా నిలిచింది.


 


ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా కూడా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అనంతరం ఈయన నటించిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కూడా ఈ సినిమాలో డిజాస్టర్ నిలిచాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరొక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: