ప్రముఖ హాస్య నటులలో ఒకరైన సూరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ నటుడు ఎక్కువగా కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉంటారు. అయితే ఈ నటుడు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ నటుడు ఫోటో చూస్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. ఎక్కువగా అగ్ర హీరోల సినిమాల్లో తనకోసం ఏదైనా పాత్ర ఉందంటే కచ్చితంగా తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నటుడు సూరి. కేవలం నటుడుగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా పలు వ్యాపారాలను మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ నటుడు పై అధికారులు రైడ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం.


సినీ నటుడు సూరి తమిళనాడులో మధురై తో పాటు పలు ప్రాంతాలలో కూడా ఈ నటుడికి హోటల్స్ ఉన్నాయట. ఈ నటుడు హోటల్లో అందరిని ఆకర్షించే అంశం ఏమిటంటే తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించడం. అందుచేతనే ఈయన వ్యాపారాలు బాగా సాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి శాఖ ఆహారాన్ని వండి వడ్డించే ఈ హోటల్లో పైన తాజాగా వాణిజశాక అధికారులు రైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. మంచి పేరు ఉన్న ఈ ఫోటోలపై జిఎస్టి అధికారులు రైడ్ చేయడం ఏమిటి అనే ప్రశ్న అడగగా.. ఈ హోటల్ పైన ఇతర ప్రాంత హోటల్స్ కంప్లైంట్స్ చేశారని చెబుతున్నారట.


అయితే తక్కువ ధరకే నాణ్యమైన ఫుడ్ ఎలా ఇస్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్నగా మారినట్లు తెలుస్తోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హోటల్లో అమ్ముతున్న ఫుడ్ ధరల విషయంలో జిఎస్టి చెల్లింపు లేదన్న విషయాన్ని గుర్తించినట్లుగా అధికారులు తెలియజేశారు.దీంతో ఆయనకు నోటీసులు జారీ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నటుడు నిర్మించిన పలు హోటల్స్ పైన కూడా ఒకేసారి తనిఖీలు జరిగినట్లుగా సమాచారం. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ లోనే పలు హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: