చందమామ కాజల్ బ్యాక్ టు వర్క్ అంటున్నారు. తల్లయ్యాక కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైన కాజల్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
భారతీయుడు 2 చిత్రీకరణ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. మిగిలి ఉన్న భాగాన్ని దర్శకుడు శంకర్ పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీలో కాజల్ పాత్ర సాహసోపేతంగా ఉండనున్నట్లు అర్థమవుతుంది. ఆమె కత్తీ, డాలు పట్టి యుద్ధ సన్నివేశాల్లో నటించనున్నారట. దీని కోసం బాగా కష్టపడుతుంది. నిపుణుల సమక్షంలో కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది.
యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న కాజల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తల్లయినప్పటికీ ఫిట్ గా ఉన్న కాజల్ చెమటోడ్చి సినిమాకు అవసరమైన కళలు నేర్చుకుంటున్నారు. కాజల్ కమిట్మెంట్ చూసిన నెటిజెన్స్ భేష్ అంటున్నారు. తాజా వీడియో నేపథ్యంలో సినిమాలో ఆమె పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి.

ఎప్పుడో విడుదల కావాల్సిన భారతీయుడు 2 నిర్మాతలకు దర్శకుడికి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా మధ్యలో ఆగిపోయింది. దానికి తోడు క్రేన్ విరిగిపడి సెట్స్ లో ఒక వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో భారతీయుడు 2 సినిమా చిత్రీకరణ ఆపివేశారు. ఇటీవల విడుదలైన కమల్ హాసన్మూవీ విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా విక్రమ్ నిర్మాతలకు రెట్టింపు లాభాలు పంచింది. హీరో నితిన్ రెండు రాష్ట్రాల్లో విడుదల చేసి పెట్టుబడికి రెండింతలు రాబట్టాడు.
విక్రమ్ సక్సెస్ భారతీయుడు 2 మేకర్స్ లో చలనం తీసుకొచ్చింది. ఈ హైప్ మధ్య సినిమా పూర్తి చేసి విడుదల చేయడం ద్వారా.. ఎంతో కొంత రాబట్టవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. రామ్ చరణ్ సినిమా కూడా పక్కన పెట్టి శంకర్ భారతీయుడు 2 పూర్తి చేస్తున్నాడు. ఈ మూవీలో మరో హీరోయిన్ గా రకుల్ నటిస్తున్నట్లు సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ కి భారతీయుడు 2 ఏ స్థాయి విజయం అందిస్తుందో చూడాలి. కాజల్ గతంలో నటించిన మరో మూడు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: