ఈ మధ్య సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారానే ఒకరి వ్యక్తిగత జీవితంపై క్లారిటీ వచ్చేస్తుంది. సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం బయటపడింది సోషల్ మీడియా కారణంగానే.
బయటపడింది సోషల్ మీడియా కారణంగానే.
సమంత తన అకౌంట్స్ నుండి ఇంటి పేరు అక్కినేని తొలగించి కేవలం లెటర్ 'S' గా మార్చారు. అక్కడే ఊహాగానాలు పుకార్లు మొదలయ్యాయి. కొన్నాళ్ళకు అంచనాలు నిజమేనని తేలింది. సమంత మాదిరే మరికొందరు సెలెబ్రిటీలు విడాకులపై ఇదే తరహాలో హింట్ ఇచ్చారు. చిరంజీవి కూతురు శ్రీజ సైతం ఇలానే చేశారు. ఒకప్పుడు ఆమె పేరు ఇంస్టాగ్రామ్ లో శ్రీజ కళ్యాణ్ దేవ్ గా ఉండేది. కొన్ని నెలల క్రితం ఆమె కళ్యాణ్ దేవ్ ని తొలగించారు.
అయితే ఆ పని చేసి నెలలు గడుస్తున్నా అధికారిక ప్రకటన చేయలేదు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ మాత్రం విడివిడిగా ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడు. శ్రీజతో మనస్పర్థలు తర్వాత కళ్యాణ్ దేవ్ రెండు చిత్రాల్లో నటించారు. ఆ చిత్రాలకు మెగా హీరోల నుండి ఎలాంటి మద్దతు లభించలేదు. శ్రీజ తండ్రి చిరంజీవి ఇంట్లో ఇద్దరు కూతుళ్లతో ఉంటున్నారు. అప్పుడప్పుడు తన కూతురిని కళ్యాణ్ దేవ్ కలుస్తున్నాడు.

శ్రీజ-కళ్యాణ్ దేవ్విడిపోయిన మాట, విడాకులు తీసుకున్న మాట నిజమే అనేది టాలీవుడ్ విశ్వసనీయ సమాచారం. ఈ అంచనాలు బలపరిచేదిగా శ్రీజ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఉంది. సదరు పోస్ట్ లో శ్రీజ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తన బాధలను, ఇబ్బందులను పంచుకున్నందుకు, కష్ట సమయాల్లో తోడుగా ఉన్నందుకు థాంక్స్ చెప్పారు. ఇక్కడ శ్రీజ ప్రస్తావించిన ఇబ్బంది కళ్యాణ్ దేవ్ తో విడాకులే అంటున్నారు. శ్రీజ ఎమోషనల్ పోస్ట్ ఆంతర్యం కళ్యాణ్ దేవ్ తో విడిపోయిన బాధగా చెప్పొచ్చంటున్నారు..

ఇటీవల శ్రీజను రామ్ చరణ్, సుస్మిత టూర్ కి తీసుకెళ్లారు. ఆమెను ఓదార్చడంలో భాగంగా, డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చేందుకు ఇలా చేశారని తెలుస్తుంది. మొత్తంగా పరిణామాలు గమనిస్తుంటే శ్రీజ తన విడాకుల మేటర్ చెప్పకనే చెప్పకనే చెప్పారంటున్నారు. కాగా కళ్యాణ్ దేవ్ తో శ్రీజకి ఇది రెండో వివాహం. చదువుకునే రోజుల్లో శ్రీజ రహస్య వివాహం చేసుకున్నారు. మొదటి భర్తతో ఆమెకు ఒక కూతురు పుట్టారు. కొన్నాళ్లకు ఆయనతో విడిపోయిన శ్రీజ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి మరో అమ్మాయి పుట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: