సినిమా ఇండస్ట్రీకి వెళ్లిన అక్కడ స్టార్ హీరోల వారసుల హవానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా స్టార్ హీరోల కుటుంబం నుంచి వచ్చిన హీరో లకు అవకాశాలను సంపాదిస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో టాలెంట్ ఉంటే స్టార్ హీరోగా ఎదుగుతారని చెప్పవచ్చు . అయితే ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన వారి కంటే తాము ఎక్కువగా కష్టపడాల్సి వస్తూ ఉంటుందని ఆ స్టార్ హీరో వారసుడు పలు సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా అనుభవించానని తెలియజేశారు.

మొదట ఒకసారి హీరో వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుల్కర్ సల్మాన్.. ఇక ఈయన తండ్రి మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి.. ఇక తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఈ హీరో అలాగే ఎటువంటి టాలెంట్ లేకపోయినా అవకాశం ఉంది కనుక హీరోగా ఎంట్రీ ఇచ్చారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఎన్నో సందర్భాలలో ఈ నటుడు పై ట్రోలింగ్ కూడా జరిగినట్లు తెలియజేశారు. ఇలాంటివి ఎన్నో తట్టుకొని నిలబడ్డాను కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానని తెలిపారు దుల్కర్ సల్మాన్.. అయితే 2016లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉత్తమ నటుడుగా అవార్డు ఇవ్వడం జరిగింది.


అయితే ఆ విషయంలో కూడా ట్రొల్ చేయడం జరిగిందని.. నీ అవార్డు అమ్మాలనుకుంటున్నావా అయితే దాన్ని నాకు ఇచ్చే నువ్వు కొన్న దానికంటే.. అధిక ధరకే దాన్ని కొంటానంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ట్రోల్స్ చేశారని అయితే అవార్డు కేవలం తన ప్రతిభను బట్టి రాలేదని.. ఎంతోమంది తన మీద ఉద్దేశపూర్వకంగానే ట్రోల్ చేశారని తెలిపారు. అయితే అవార్డు అలా కోనుక్కోవాలి అంటే నేను అంతకాలం వెయిట్ చేయవలసిన అవసరం లేదని కానీ ఆ కామెంట్లు మాత్రం తనని చాలా బాధపెట్టాయని తెలిపారు దుల్కర్. అవార్డు అనేది కేవలం మన ప్రతిభను బట్టి వస్తాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: