ఏడాదికి దాదాపుగా ఐదు నుంచి ఆరు సినిమాల్లో నటించడమే కాకుండా ఆ సినిమాలను అంతే వేగంగా పూర్తి చేసి విడుదల చేస్తుంటాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో ఉన్న స్టార్ సెలబ్రిటీలలో ఎక్కువ సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అక్షయ్ కుమార్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే అక్షయ్ కుమార్ ఒక విలాసవంతమైన ఇంటిని అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంధేరి వెస్ట్‌లో అక్షయ్ కుమార్‌కు ఒక విలాసవంతమైన ప్రాపర్టీ ఉండగా ఆ అపార్ట్‌మెంట్‌ ను అక్షయ్ గతంలో రూ.4.16కోట్లకు కొనుగోలు చేశాడు. తాజాగా ఆ అపార్ట్‌మెంట్‌ను దబూ మాలిక్ అనే వ్యక్తికి అమ్మేశాడని మనకు తెలుస్తోంది. దబూ మాలిక్ అనే వ్యకికీ ఆ అపార్ట్‌మెంట్‌ను రూ.6. 5కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దబూ మాలిక్ ఎవరో కాదు సింగర్ అర్మాన్ మాలిక్ తండ్రే. ఆ అపార్ట్‌మెంట్ ట్రాన్స్‌కన్ ట్రయంఫ్ టవర్ 1లో ఉంది.

కాగా ఆ అపార్ట్మెంట్ విస్తీర్ణం 1281చదరపు అడుగులు ఉందట. బాల్కనీ కూడా 59 చదరపు అడుగులతో విశాలంగా ఉంటుందని మనకు సమాచారం. ఇదే కాకుండా అక్షయ్‌ కుమార్ కు ముంబైలో మరో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు ఇలా అనేక ప్రదేశాలలో కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో అక్షయ్ కుమార్ అప్పుల పాలయ్యాడు అందుకే అపార్ట్మెంట్ ని విక్రయించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అక్షయ్ కుమార్ అప్పుల పాలవడం వల్లే ఆ అపార్ట్మెంట్ ని విక్రయించాడా లేదా తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వీడియో చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: