నందమూరి  నటసింహం బాలకృష్ణ  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయింది.అయితే  ఈ విషయమై నందమూరి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా కూడా సమాచారం అందుతుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తో సినిమాను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత చాలా ఉత్సాహంతో ఉన్నాడట. అంతేకాదు ఆయన ఏకంగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టి మరీ మోక్షజ్ఞ తో సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాడు.

నందమూరి  బాలకృష్ణ అంటే ఆయనకు ఉన్న అభిమానం మరియు మోక్షజ్ఞ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయన మొదటి సినిమా అయినా కూడా మోక్షజ్ఞతో రూ. 100 కోట్ల సినిమా నిర్మించాలని ఉద్దేశంతో ఉన్నాడట. అంతేకాదు మంచి దర్శకుడు, కథ దొరికితే రూ. 100 కోట్ల బడ్జెట్ పెడతాను అంటున్నారు.ఇకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖ దర్శకులు మోక్షజ్ఞ కి కథలు రెడీ చేస్తున్నారు. ఇక ఆ కథల్లో ఏదో ఒకటి అతి త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ వద్ద ఇప్పటికే కొందరి దర్శకుల పేర్లు ఉన్నాయి. ఇక వారిలో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.

అయితే  2024 లేదా 2025లో మోక్షజ్ఞ మొదటి సినిమా వచ్చే అవకాశం ఉంది అంటూ టాలీవుడ్ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఇక అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో జరిగిన తప్పు మోక్షజ్ఞ విషయంలో జరగకుండా ఉండే ఉద్దేశంతో బాలకృష్ణ కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.నందమూరి  బాలకృష్ణ సన్నిహితులైన దర్శకులు మరియు నిర్మాతలు ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే  ఇన్ని రోజులు మోక్షజ్ఞ విషయంలో కాస్త అనుమానాలు ఉండేవి.ఇక  ఆయన సినిమాల్లో నటిస్తాడా ఆయనకు సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఇదిలావుంటే తాజాగా బాలకృష్ణ సినిమా సెట్స్ లో మోక్షజ్ఞ కనిపించి కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫర్ రేంజ్ లో ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగించాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: