టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' గురించి ఎంత చెప్పు కున్నా తక్కువే అంటారు అభిమానులు. ఈ సినిమా ను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం మొదలు కొని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల పర్ఫార్మెన్స్ వరకు ప్రతి ఒక్కటి ఈ సినిమా ను మరో లెవెల్‌కు తీసుకెళ్లా యని వారు అంటు న్నారు.
ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరి కీ తెలిసిందే.
అయితే.. ఈ సినిమా లో హీరో ల పర్ఫార్మెన్స్‌ ల విషయాని కి వస్తే.. రామvరాజుగా చరణ్, భీమ్‌గా తారక్ విధ్వంసకరమైన యాక్టింగ్‌ తో చెలరేగి పోయారు. ఇక నవరసా లను పిండి పిప్పిచేసే తారక్ ఈ సినిమా  లో 'కొమురం భీముడో..' పాటతో యావత్ ప్రపంచvవ్యాప్తంగా జయహో అనిపించుకున్నాడు. ఆ పాటలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ కు అందరూ ఫిదా అయ్యారు. కాగా, తాజాగా ఈ పాటbకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాbలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు.. ఏంటి… ఇది కొమురం భీముడో పాట కాదా… యాడ్ ఆ.. అని అవాక్కవ్వడం ఖాయం.

ఒరిజినల్ వీడియో లను ఎడిట్ చేసి పర్ఫెక్ట్‌ గా సింక్ చేసే కొందరు నెటిజన్లు, కొమురం భీముడో పాటకు సంబంధించిన వీడియో ను ఓ చాక్లెట్ యాడ్ వీడియో గా మార్చారు. డెయిరీ మిల్క్ చాక్లెట్ యాడ్‌ లో వచ్చే 'కిస్ మీ..' పాటకి తారక్ పర్ఫార్మెన్స్‌ ను పర్ఫెక్ట్‌ గా సింక్ చేసిన విధానం సూపర్‌ గా ఉంది. ఈ వీడియో చూస్తే, నిజంగా ఇది ఈ యాడ్ కోసమే చేశారా అనేలా ఉండటం విశేషం. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏదో ఒక విధంగా ఇంకా వైరల్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. మరి ఈ పర్ఫెక్ట్ సింక్ వీడియోను మీరు ఓసారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: