సినిమా ఇండస్ట్రీలో పద్దతిగా ఉండే హీరోయిన్ లతో పాటూ ఫుల్ గా ఎంజాయ్ చేసే హీరోయిన్ లు కూడా ఉంటారు. కొంతమంది హీరోయిన్లు వరుస ఆఫర్ లు వస్తుండగానే పెళ్లి చేసుకుని భర్తలతో కాపురాలు చేస్తూ ఎలాంటి అఫైర్ లు లేకుండా ఉంటారు.
కానీ కొంతమంది మాత్రం బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి లిస్ట్ లో మగధీర ఐటమ్ గర్ల్ కిమ్ శర్మ కూడా ఉంది. కిమ్ శర్మ 2000 సంవత్సరంలో బాలీవుడ్ లో మహోబత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తరవాత చాలా సినిమాలలో నటించింది.

తెలుగులో మగధీర సినిమాలో జోర్సె జోర్సె అనే ఐటమ్ సాంగ్ లో చరణ్ తో కలిసి స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఇక కిమ్ శర్మ లవ్ ఎఫైర్లు నడిపించిన వాళ్ల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కిమ్ శర్మ ప్రస్తుతం మాజీ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ తో లవ్ లో ఉంది. కిమ్ తన కెన్యా భర్తకు విడాకులు ఇచ్చేయగా, పేస్ కూడా కేవలం కిమ్ కోసమే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. అంతే కాకుండా కిమ్ శర్మ గతంలో యువరాజ్ సింగ్ తోనూ లవ్ ఎఫైర్ నడిపించింది.

వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ తరవాత మాత్రం వీరిద్దరూ విడిపోయారు. కిమ్‌కు దూరమయ్యాక యువరాజ్ హాలీవుడ్ నటి హజల్‌ను పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా కిమ్ శర్మ మొదట వ్యాపారవేత్త అలీ పుంజానితో లవ్ ఎఫైర్ నడిపించి అతడిని పెళ్లి కూడా చేసుకుంది. అతడు కెన్యాకు చెందిన ప్రముఖ మాదక ద్రవ్యాల వ్యాపారి. అయితే వయస్సులో కిమ్ కంటే చాలా పెద్దోడు.

కేవలం డబ్బుకోసమే అతడిన పెళ్లి చేసుకుందన్న విమర్శలు కూడా ఎదుర్కొంది. అతడిని పెళ్లి చేసుకుని కెన్యా రాజధాని నైరోబిలో కాపురం కూడా చేసింది. ఇక కొంతకాలం కలిసి ఉన్న వీరిద్దరూ ఆ తరవాత విడిపోయారు. మరోవైపు యంగ్ హీరోను కూడా వదిలిపెట్టలేదు ఈ బ్యూటీ. టాలీవుడ్ లో హీరోగా మరియు ముఖ్యమైన పాత్రలలో నటించే హర్షవర్దన్ రానేతోనూ లవ్ ఎఫైర్ నడిపించింది. చాలా కాలం పాటూ వీరిద్దరూ డేటింగ్ చేశారు. కానీ తరవాత ఏమైందో కానీ ఇద్దరూ విడిపోయారు.

గతంలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. కానీ తరవాత హ్యాపీగా విడిపోయారు. ఇక కిమ్ శర్మ ఇప్పుడు లియాండర్ పేస్ ను పెళ్లాడబోతందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి చివరికి లియాండర్ ను అయినా పెళ్లి చేసుకుంటుందా లేదంటే లైట్ తీసుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: