లెజెండరీ డైరెక్టర్ అయిన మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కి సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు


ఇకపోతే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మణిరత్నం ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా మణిరత్నం మాట్లాడుతూ ఈ సినిమా లో త్రిష, ఐశ్వర్యరాయ్ పై సీరియస్ అయ్యార నే విషయాన్ని కూడా తెలియజేశారు.


ఈ సినిమాలో త్రిష ఐశ్వర్యరాయ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరిని మణిరత్నం దూరం గా ఉండమన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గురించి కూడా ఈ సందర్భంగా మణిరత్నం క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ త్రిష పాత్రలు చాలా సీరియస్ గా కొనసాగుతాయి అయితే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు తీసే సమయంలో వీరి ఫేస్ లో అలాంటి సీరియస్ నెస్ కనిపించడం లేదు.దీంతో వీరిద్దరిపై ఎక్కువసార్లు టేకులు కూడా తీసుకోవాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడ్డానని వీరిద్దరి సన్నివేశాలు పూర్తి అయ్యేసరికి తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఈ సందర్భంగా మణిరత్నం పేర్కొన్నారు.


ఇలా వీరిద్దరి మధ్య సీరియస్ నెస్ రాకపోవడానికి గల కారణం కేవలం వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణమని చెప్పాలి. అందుకే వీరిద్దరూ సెట్ లో దూరంగా ఉండమని చెప్పానని ఈయన వెల్లడించారు.మొత్తానికి త్రిష ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్షిప్ కారణంగా మణిరత్నం ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా మణిరత్నం చెప్పకనే చెప్పారట.. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: