ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇదొక ఫ్యాషన్ గా తయారయ్యింది. ఎంత బొద్దుగా చబ్బిగా ఉన్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ జీరో సైజ్ కి రావటం. దానికి కారణాలు ఏవైనా కానీ ఇలా ఉన్నపలంగా భారీ స్థాయిలో బరువు తగ్గడం అనేది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు డాక్టర్స్.
కాగా ఇప్పటికే బోలెడు మంది హీరో హీరోయిన్స్ తమ బాడీ ట్రాన్స్ ఫార్ మేషన్ చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. సన్నగా అయినందుకు హ్యాపీగానే ఉన్నా కానీ బొద్దుగా ఉంటేనే మీలో ఆ కల ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా ఆ లిస్ట్ లోకి యాడ్ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో. మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ గీతామాధురి భర్త ఈ యంగ్ హీరో నందు. వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే 100% లవ్ సినిమా తప్పిస్తే నందు ఖాతాలో ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు కనీసం హీరో గా కూడా గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయాడు .

కాగా రీసెంట్గా ఆయన తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో భారీ సంఖ్యలో నందు కు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం నందు ఇలాంటి లుక్స్ లో బాగోలేదని ఒకప్పుడు బొద్దుగా ఉన్నప్పుడే బాగున్నాడని అంటున్నారు. అయితే నందు ఇలా సడెన్ గా వెయిట్ తగ్గడానికి కారణం ఓ స్టార్ డైరెక్టర్ క్రేజీ ఆఫర్ అని తెలుస్తుంది . తన బాడీ ఫిజిక్ ను మార్చుకుంటే.. ఒక అద్భుతమైన కథలో మెయిన్ హీరో గా పెట్టి సినిమా తీద్దామని స్టార్ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చారట. ఈ కారణంగానే తన బాడీని మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: