తెలుగు బుల్లితెర పేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా, యాంకర్ గా ఇలా అన్ని రంగాలలో దూసుకుపోతూ బుల్లితెరపై స్టార్ హీరోల రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు.
సుడిగాలి సుధీర్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే గత రెండు మూడు నెలలుగా సుధీర్ ఆలోచన విధానం ఏంటి అనేది అర్థం కాక అభిమానులు తల పట్టుకుంటున్నారు. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత కొద్ది రోజులపాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశాడు. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ మానేసి యాంకర్ అనసూయ తో కలిసి ఒక పాటల షోకి సింగర్ గా చేశాడు.

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజీ తెచ్చుకోవడంతో వెండితెరపై వరస సినిమా అవకాశాలతో దూసుకుపోదాం అనే సుడిగాలి సుదీర్ భావించాడు. అందుకు అనుగుణంగానే వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ అవి సుధీర్ కు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో సుడిగాలి సుదీర్ బుల్లితెరపై కనిపించడమే మానేశాడు. అయితే అభిమానులు కూడా సుధీర్ కు అవకాశాలు రావడం వల్లే సినిమా షూటింగులో బిజీగా ఉంటూ బుల్లితెరపై కనిపించలేదు అని అనుకున్నారు. దీంతో సుడిగాలి సుదీర్ విషయం గురించి ఈ మధ్యకాలంలో పెద్దగా పట్టించుకోవడమే మానేశారు.

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం సుధీర్ సినిమాల వల్ల బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు అన్న విషయం నిజం కాదని సుధీర్ ఒక అరుదైన జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అది కాస్త బాగా ముదిరిపోయిందని అందుకే బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు అని తాజా సమాచారం. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేసే పొజిషన్ లో లేకపోవడం వల్ల సుధీర్ బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు అని తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ విషయం పట్ల అభిమానులు కంగారు పడుతున్నారు. తమ అభిమాన సెలబ్రిటీకి ఏమయింది అని సుడిగాలి సుధీర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాల గురించి ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: