టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రామ్ చరణ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ హీరోలలో ఒకరు కావడంతో పాటు చరణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందిచరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయనే విషయం తెలిసిందే.


అయితే చరణ్ సినిమాల్లోకి రావడం చిరంజీవికి ఏ మాత్రం ఇష్టం లేదని సమాచారం. చిరంజీవి చరణ్ ను డాక్టర్ గా చూడాలని అనుకున్నారని సమాచారం. చరణ్ మాత్రం యాక్టర్ కావడంతో చిరంజీవి కల కలగానే మిగిలిపోయింది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం సులువు కాదని చిరంజీవికి బాగా తెలుసు. కొన్ని సినిమాల కోసం ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువనే విషయం తెలిసిందే.


 


ఈ రీజన్ వల్లే చిరంజీవి చరణ్ ను సినిమాలకు దూరంగా ఉంచాలని అనుకున్నారు. అయితే చరణ్ మాత్రం సినిమాలపై ఆసక్తి చూపి సినిమాల్లోకి వచ్చారు. చిరుత సినిమా నుంచి ఆచార్య సినిమా వరకు సినిమాసినిమాకు చరణ్ నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్నారనే విషయం తెలిసిందే. చరణ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అభిమానులు ఏర్పడ్డారు. చరణ్ ఒక్కో సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.


 


రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ ల తో భారీ విజయాల ను సొంతం చేసుకుని మరిన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేయాల ని ఫ్యాన్స్ భావిస్తున్నారట.కెరీర్ విషయంలో రామ్ చరణ్ ఆచితూచి అడుగు లు వేస్తున్నారు. చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: