బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పటికి కూడ పూర్తిగా సెటిల్ కాలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ అన్న పదం అతడి కాంపౌండ్ దరికి చేరడం లేదు. ఇక లాభం లేదు అనుకుని తన తమ్ముడు ద్వారా హిట్ వస్తుందేమో అన్న ఆశతో ఇప్పుడు బెల్లంకొండ గణేష్ నటిస్తున్న ‘స్వాతిముత్యం’ మూవీ రిజల్ట్ గురించి ఆశక్తిగా ఎదురు చూస్తున్నాడు.కమలహాసన్ విశ్వనాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘స్వాతిముత్యం’ మూవీ ఒక ట్రెండ్ సెటర్ అలాంటి టైటిల్ ను ఒక కొత్త హీరో సినిమాకు పెట్టాలి అంటే చాల ధైర్యం ఉండాలి. అయితే ఎలాంటి భయం లేకుండా బెల్లంకొండ గణేష్ తన తొలి సినిమాకు ‘స్వాతిముత్యం’ అన్న టైటిల్ ను పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈ యంగ్ హీరో సినిమాను దసరా నాడు ‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ సినిమాల మధ్య విడుదల చేస్తూ ఏకంగా ఇండస్ట్రీకి షాక్ ఇస్తున్నాడు. వర్ష బోల్లమ్మ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈమూవీకి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈమూవీని నిర్మిస్తున్నది టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కావడంతో ఈ మూవీకి ధియేటర్ల సమస్య అంతగా ఏర్పడకపోవచ్చు అన్న ధైర్యంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.సంక్రాంతి సీజన్ తో పోల్చుకుంటే దసరా సీజన్ అంత పెద్ద పండుగ కానే కాదు. దీనికితోడు సగటు ప్రేక్షకుడు సంక్రాంతి సీజన్ లా పండుగ సీజన్ కు వచ్చిన ప్రతి సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని అనుకోడు అయినప్పటికీ ఈ దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ చిరంజీవి నాగార్జున లు పోటీ పడటం ఒక ఆశ్చర్యం. అయితే వీరి మధ్య ఒక యంగ్ హీరో మొదటి సినిమా విడుదల అవ్వడం చూసి ఏ దైర్యంతో ఇతడు ఈ రేస్ లోకి వస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: