అందాల ముద్దు గుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే సమంత ఎన్నో కమర్షియల్ సినిమా లలో తన అంద చందాలను అరబోయడం మాత్రమే కాకుండా ,  ఎన్నో వైవివిధ్యమైన సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా కమర్షియల్ మూవీ లతో ,  వైవిధ్యమైన మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సమంత ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.

ప్రస్తుతం సమంత కమర్షియల్  మూవీ లలో ,  గ్లామర్ పాత్రలలో నటించడం కంటే కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత ,  గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మరియు యశోద మూవీ లలో  నటించింది. ఈ రెండు మూవీ లు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు అయినటువంటి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా సమంత నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా సమంత చర్మ సమస్యలతో బాధపడుతుంది అని ,  అందుకు చికిత్స కోసం ఆమె అమెరికా వెళ్ళింది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.  కానీ ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని తెలుస్తుంది. సమంత  ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ దర్శకులు అయినటువంటి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిటాడిల్ అనే వెబ్ సిరీస్ కోసం , ఈ వెబ్ సిరీస్ లో పాత్రకు తగిన ఫిట్నెస్ కోసం సమంత అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: