దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకం గా తెర కెక్కించిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. పాన్‌ ఇండియా మూవీ గా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా రిలీజ్‌ కాబో తోంది.
దీంతో మూవీ ప్రమోషన్స్‌ లో చిత్ర బృందం ఫుల్‌ బిజీ గా ఉంది. ఈ నేపథ్యం లో ఇటీవల మీడియా తో ముచ్చటించిన ఆయన సెట్స్‌లో కొన్ని సార్లు స్టార్‌ హీరోయిన్స్‌ అయిన ఐశ్వర్య రాయ్‌, త్రిషలపై సీరియస్‌ అయ్యా నంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.
షూటింగ్‌ సమయం లో త్రిష, ఐశ్యర్యరాయ్‌ లతో కాస్తా ఇబ్బంది పడ్డానని, అందు కే వారి పై పలుమార్లు అరిచానన్నారు.'ఈ చిత్రం లో త్రిష, ఐశ్వర్య ల సన్ని వేశాలు, డైలాగ్స్‌ సీరియస్‌ గా కొన సాగుతాయి. షూటింగ్‌ చేస్తున్నప్పుడు వారిద్దరి మధ్య ఆ సీరియస్‌ నెస్‌ వచ్చేది కాదు. దానికి కారణం సెట్స్‌ లో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. అందువల్ల వారి సీన్స్‌ సరిగా వచ్చేవి కాదు. వారిద్దరి సీన్స్‌ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. అసలు అనుకున్నట్టు సీన్స్‌ వచ్చేవి కాదు. వాటికి చాలా టైం పట్టేది. దీంతో సినిమా అయిపోయే వరకు వారిని మాట్లాడు కోవద్దని వార్నింగ్‌ కూడా ఇచ్చాను.
అయినా వారు వినకపోవడం తో కొన్ని సార్లు ఇద్దరి ని ఇద్దరిపై కోప్పడాల్సి వచ్చింది' అని ఆయన చెప్పుకొచ్చారు. భారీ తారాగణం తో రూపొందిస్తున్న ఈ చిత్రం లో చియాన్‌ విక్రమ్‌, జయం రవి, హీరో కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, శోభితా ధూలిపాళ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పదో శతాబ్దం లోని చోళ రాజుల ఇతివృత్తం తో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తం గా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా తెర కెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: