ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్'తో ఫామ్ లోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు మళ్లీ కష్టకాలం వచ్చింది.తాజాగా  సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం 'లైగర్' డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, పూరీ కూడా బాలీవుడ్ లో హవా క్రియేట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.థియేటర్లలోకి వచ్చిన 'లైగర్'కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తూ మతిపోయింది .విజయ్... భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్, ఆడియెన్స్ ను పూరీ జగన్నాథ్ పూర్తిగా నిరాశ పరిచారు.

అంతేకాదు  పైగా మొదటి వారానికే థియేటర్ల నుంచి సినిమా వెళ్లిపోవడంతో నిర్మాతగా ఉన్న పూరీ కూడా ఆర్థిక నష్టం వాటిల్లింది.అయితే ఇప్పుడిప్పుడే 'లైగర్' తెచ్చి పెట్టిన ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడుతున్నారు.ఇదిలావుంటే  మరోవైపు అసంత్రుప్తిలో ఉన్న అభిమానులను ఖుషీ చేసేందుకు మళ్లీ సంసిద్ధమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలు ఫ్లాఫ్ అవడం, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం పూరీ జీవితానికి కొత్తేమీ కాదు. పూరీ కేరీర్ లో ఈ స్థాయిలో డిజాస్టర్ ను అందుకోవడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ గోవాలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే  తన నెక్ట్స్ మూవీ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈసారి గట్టిగా బౌన్స్ బ్యాక్ ఇచ్చేందుకు కథపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.ఇక  మరింత బలమైన స్టోరీతో ప్రేక్షకుల మన్ననలను పొందడంతో పాటు.. ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని ఫిక్స్ అయ్యారంట.ఇదిలావుంటే ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం పూరీని తెలుగు హీరోలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. యంగ్ హీరో ఆకాష్ పూరీతోనే సినిమా తీయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగైతే ఇక  తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.ఇక  దీనిపైనా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పూరీ టీమ్ స్క్రిప్ట్ వర్క్ ను స్టార్ట్ చేసినట్టు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: