ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ...పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు.ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమాగా రుపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది.అయితే  అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో షూట్ చేశారు.ఇక దీంతో మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు సినిమా నిర్మాత నాగవంశీ ప్రకటించారు.

అయితే సె కండ్ షెడ్యూల్ కూడా అక్టోబర్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇక నిజానికి ఈ సినిమా షూట్ కూడా మొదలు కాకముందే ఈ సినిమాలో పూజా హెగ్డేనుకే హీరోయిన్గా ఫైనల్ చేశారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే  ఇక గతం నుంచి ఆయన చేస్తున్న అన్ని సినిమాలను పరిశీలిస్తే సెకండ్ హీరోయిన్ గా మరో భామకు ఆయన అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ ఉందని ఆ హీరోయిన్ గా జాతి రత్నాలు భామ ఫరియా అబ్దుల్లాని తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

అయితే  త్వరలోనే ఆమె షూట్ లో పాల్గొంటారని కూడా ప్రచారం జరుగుతున్న క్రమంలో నిజం కాదని సూపర్ స్టార్ మహేష్ బాబు 28 సినిమా వర్గాల నుంచి సమాచారం. ఇక  అసలు సెకండ్ హీరోయిన్ అనే అవకాశం ఈ సినిమా కథలో లేదని, త్రివిక్రమ్ గత సినిమాలతో ఈ సినిమాను పోల్చే అవసరం లేదని వారు చెబుతున్నారు.ఇక ఫరియా అబ్దుల్లాను అసలు తీసుకునే ఆలోచన లేదని, సెకండ్ హీరోయిన్ కి అవకాశమే లేనప్పుడు ఆమె పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని వారు అంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ, సితార ఎంటర్ టైన్మెంట్స్ నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023 వేసవిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు చూడాలి మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: