మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం గాడ్ ఫాదర్ మూవీతో మరో సారి ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. గాడ్ ఫాదర్ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటువంటి లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.

మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్యదేవ్ ,  నయనతార ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మరియ హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నైజాం హక్కులకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ నైజాం హక్కులను 25 కోట్లకు ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: