టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం బంగార్రాజు , బ్రహ్మాస్త్రం మూవీ లతో ప్రేక్షకులను అలరించాడు . బంగార్రాజు మూవీ లో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్ర లో నటించగా ,  బ్రహ్మాస్త్రం మూవీ లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించాడు .

బ్రహ్మాస్త్రం మూవీ ప్రస్తుతం విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది . ఇది ఇలా ఉంటే నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో నాగార్జున మరియు సోనాల్ చౌహాన్ ఇంటర్పోల్ ఆఫీసర్ లుగా కనిపించ బోతున్నారు. అలాగే ఈ మూవీ లో అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రలలో కూడా యాక్షన్స్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ ఆంధ్ర ఏరియాలో బిజినెస్ ని ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఏరియా కు గాను ది ఘోస్ట్ మూవీ 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: