యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించ బోతున్నాడు.

మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడింది. అలాగే ఈ మూవీ నుండి ఒక మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించ బోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: