టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి అర్జెంట్ గా హిట్ కావలి. ఇక అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ హిట్ అందుకోలేకపోయాడు.అయితే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక చాలా కాలం తర్వాత ఈ తో హిట్ అందుకున్నాడు పూరిజగన్నాథ్. అయితే అప్పటివరకు వరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను ఊర మాస్ లుక్ లో చూపించాడు పూరి.ఈ సినిమా  లో తనదైన డైలాగ్ డెలివరీతో.. తెలంగాణ యాసలో.. యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు రామ్.  

ఈ  సినిమా తర్వాత రెడ్ అనే చేశాడు. ఇక తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక  ఈ సినిమా  తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కాగా భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.అయితే  తమిళ్ తెలుగు భాషల్లో విడుదలైన ఈ లో అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ  సినిమా తర్వాత ఇప్పుడు టాప్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నాడు రామ్.ఇదిలావుంటే  ఇటీవలే అఖండ తో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి.

అయితే బాలయ్య నటించిన అఖండ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది.కాగా  బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గానిలిచింది అఖండ.  ఇప్పుడు అందరి చూపు రామ్, బోయపాటి పైనే.. అటు రామ్ , ఇటు బోయపాటి చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా అవ్వడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ  సినిమా ను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట బోయపాటి. ఈ సినిమా  ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడట బోయపాటి. అయితే ఇందుకోసం దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.  అనుకోని విధంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇదిలావుంటే ఇక ఇప్పుడు ఈ ఆ రెగ్యులర్ షూట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.కాగా దసరా పండుగ తర్వాత ఈ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: