టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలలో ఖలేజా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.ఇక బుల్లితెరపై ఖలేజా సినిమా హిట్టైనా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి.అయితే  ఖలేజా సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

అయితే పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడింది. కాగా ఈ సినిమాలో ఇతర భాషల నటులను నటింపజేయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నా ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉన్న నటులు దొరకడం లేదని సమాచారం. అయితే అందువల్ల టాలీవుడ్ పాపులర్ నటులకు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని బోగట్టా.ఇక మహేష్ బాబు సినిమాలో కలెక్షన్ కింగ్ నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఇకపోతే  మహేష్ బాబు ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా త్రివిక్రమ్సినిమా కొరకు 30 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.అంతేకాదు ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా 2023 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. ఇకపోతే త్రివిక్రమ్ మోహన్ బాబును సంప్రదిస్తే ఆయన ఈ సినిమాకు నో చెప్పే అవకాశం అయితే ఉండదు.ఇక  త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని బోగట్టా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: