సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఈ సంవత్సరం పరశురామ్ దర్శకత్వంలో పెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా సర్కారు వారి పాట మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరక్కెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయింది.  అక్టోబర్ 10 వ తేదీ నుండి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ షెడ్యూల్ లో పూజ హెగ్డే కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఇది ఎలా ఉంటే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో రెండవ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు ,  ఆ రెండవ హీరోయిన్ పాత్రలో జాతి రత్నాలు మూవీ లో హీరోయిన్ గా నటించిన ఫారియా అబ్దుల్లా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఎలాంటి రెండవ హీరోయిన్ క్యారెక్టర్ లేదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లి మూడవ సినిమా. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: