కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అలాగే రజనీ కాంత్ తాను నటించిన మూవీ ల ద్వారా భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  

ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒక జైలు సెట్ లోనే జరగనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే జైలర్ మూవీ సూపర్ స్టార్ రజినీ కాంత్ కెరీర్ లో 169 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో రమ్య కృష్ణ కూడా కనిపించబోతుంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ పై తమిళ సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రజినీ కాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా ,  ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: