కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఉంటే తాజాగా కార్తీ 'సర్దార్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం సర్దార్ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రాజేష విజయన్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ కి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా సర్దార్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. సర్దార్ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ టీజర్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. సర్దార్ మూవీ యూనిట్ ఈ రోజు ఏ సమయానికి సర్దార్ మూవీ టీజర్ ని విడుదల చేయబోతున్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే సర్దార్ మూవీ ని ఈ సంవత్సరం దీవాలి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సర్దార్ మూవీ పై కార్తీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: