తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో కామెడీ చిత్రాల్లో హీరోగా నటించి తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లరి నరేష్ తన కెరియర్ ప్రారంభం లో ఎక్కువ కామెడీ ప్రాధాన్యత ఉన్న మూవీ లలో హీరోగా నటిస్తూ వచ్చాడు. అందులో భాగంగా అల్లరి నరేష్ నటించిన చాలా కామెడీ సినిమాలు అద్భుతమైన విజయాలను బాక్సా ఫీస్ దగ్గర సాధించాయి. కానీ గత కొంత కాలంగా అల్లరి నరేష్ కామెడీ నేపథ్యంలో నటించిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించలేకపోయాయి. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా మధ్య మధ్యలో కాస్త వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. 

అల్లరి నరేష్ కొంత కాలం క్రితం నాంది అనే మూవీ లో వైవిధ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాంది మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఏ ఆర్ మెహన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  ఆనంది ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. సాయి చరణ్ పాకాల ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను నవంబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ తో అల్లరి నరేష్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: