తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు కాని, అందులో ఎక్కువ శాతం అమ్మాయిలే హవాను చూపిస్తున్నారు. వాళ్ల పోటీని తట్టుకుని నిలబడిన మేల్ యాంకర్లలో రవి ఒక్కరు ఉన్నారు

దాదాపు దశాబ్ద కాలంగా తనదైన శైలి హోస్టింగ్‌ అండ్ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోన్న అతడు.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం ఆయన సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ రవికి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!


అలా వచ్చాడు.. ఫుల్ పాపులర్
 
యాంకర్ కాకుముందే రవి రేడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించారు, ఆ తర్వాత హోస్టుగా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ప్రేక్షకులతో పాటు నిర్వహకుల దృష్టిలో పడిపోయాడు. దీంతో అతడికి వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ షోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.

వివాదాలు.. బ్యాడ్ ఇమేజ్‌తోనే
 

యాంకర్‌గా ఎంతో మంచి పేరును సంపాదించుకున్న రవి.. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో గొడవల్లో అనవసరంగా భాగం అయ్యాడు. అలాగే, పర్సనల్ లైఫ్ విషయంలోనూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫలితంగా బ్యాడ్ ఇమేజ్ వచ్చింది.

బిగ్ బాస్ ఛాన్స్.. ఎలిమినేషన్
 

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి యాంకర్ రవి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అతడు ఎందుకనో ప్రభావితం చూపలేకపోగా.. గుంటనక్క అని, గొడవలు పెడుతుంటాడని.. ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి. దీంతో అతడిపై విమర్శలు ఎక్కువైపోయాయి. ఫలితంగా యాంకర్ రవి.. ఊహించని విధంగా 12వ వారం  బిగ్ బాస్ షో నుంచి బయటకు బయటకు వచ్చారు.

మళ్లీ బిజీ అయిపోయిన రవి
 

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత యాంకర్ రవి చాలా రోజుల పాటు తన కుటుంబంతోనే  ఎక్కువ సమయాన్ని గడిపాడు. ఈ క్రమంలోనే మాల్దీవులు ట్రిప్ కూడా వెళ్లాడు. అనంతరం కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో షోతో పాటు కొన్ని ఈవెంట్లు కూడా చేస్తున్నాడు. ఇలా తన వర్క్‌తో మళ్లీ ఫుల్ బిజీగా మారిపోయాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
 

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా యాంకర్ రవి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంటాడు. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నాడు. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా వదులుతున్నాడు. తద్వారా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఉందా అని అడిగిన నెటిజన్
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ రవి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ నిర్వహించాడు. ఇందులో ఓ నెటిజన్ అతడిని 'ఉందా' అని డబుల్ మీనింగ్‌లో అర్థం వచ్చేలా ఓ వింత ప్రశ్నను అడిగాడు. దీనికి షాకైపోయిన యాంకర్ రవి 'అందరికీ ఉంటుందిగా' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి రవి అభిమానులు మద్దతు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు.

సైజ్ ఎంత అంటూ మరొకటి
 

ఇదే సెషన్‌లో మరో నెటిజన్ 'నీ సైజ్ ఎంత' అని యాంకర్ రవిని ప్రశ్నించాడు. దీనికి అతడు 'ఒరేయ్ నాయనా? ఏమౌతుందిరా మీకు? రాత్రి ఎఫెక్టా ఏంటి? ఏం సైజ్ అడిగావ్‌రా బాబు? సరే.. నా షూ సైజ్ 10. నా షర్ట్ సైజ్ 40 అంటూ సమాధానం చెప్పారు . ఇలా చాలా మంది నెటిజన్లు యాంకర్ రవిని విసిగించేలా ప్రశ్నలు అడిగారు. కానీ, అతడు మాత్రం ఓపికగానే బదులిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: