మెగా హీరో అల్లు అర్జున్ ఇటీవల కాలంలో పెద్దగా కనిపించలేదు.దాదాపు చాలా కాలం తర్వాత సరికొత్త కథ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అల్లు శిరీష్ ఇటీవల సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తుండటంతో ఆయన సినిమా వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. ఇక ఆయన నటించిన ఓ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నా, కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమం లోనే ఈ సినిమా టైటిల్‌ ను కూడా 'ఊర్వశివో రాక్షసివో' పేరుకు మార్చింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
ఒకే ఆఫీసులో పనిచేసే హీరో హీరోయిన్లు, ఒకరినొకరుఇష్టపడతారు. అయితే హీరోయిన్‌ తో రిలేషన్‌ లోకి వెళ్తాడు హీరో. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం కేవలం ఫ్రెండ్స్ గానే ఉందామని హీరో తో చెబుతోంది. ఈ ట్విస్టుతో హీరో ఏం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో శిరీష్ రిఫ్రెషింగ్ లుక్‌ తో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు. అటు హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో ఎక్కువశాతం లిప్‌లాక్ సీన్స్, రొమాన్స్‌నే నింపేశారు చిత్ర యూనిట్.


వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను రాకేష్ శశి తెరకెక్కిస్తుండ గా, ధీరజ్ మొగిలినేని, విజయ్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. GA2 పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమా ను ప్రెజెంట్ చేస్తున్నారు.. ఈ సినిమా అన్నా ప్రేక్షకుల ను ఆకట్టుకుంటోందేమో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: