బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఇమే మళ్ళీ డిజిటల్ వేదికపై సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈమె ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్" మజా మా " డైరెక్టర్ ఆనంద్ తివారి తెరకెక్కించారు. ఈ చిత్రంలో గజరాజ్ రావు, రిత్విక భౌమిక, సృష్టి శ్రీవాస్తవ, సిమూన్ సింగ్, తదితరులు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇద్దరూ టీనేజ్ పిల్లలకు తల్లిగా కనిపించబోతోంది మాధురి దీక్షిత్.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన మాధురి దీక్షిత్ ఇండస్ట్రీ గురించి ప్రజెంటేషన్ ఉన్న స్టార్స్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1980,90 లలో సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. గతంలో గ్లామర్ రోల్స్ లో మాత్రమే ఎక్కువగా కనిపించిన తారలు ఇప్పుడు చాలా డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ తమని తాము ప్రూఫ్ చేసుకుంటూ ఉంటున్నారని తెలియజేస్తోంది. అందుకు అవకాశాలు బాగానే వస్తూ ఉన్న ఈ జనరేషన్లో స్టార్ గా లైఫ్ కంటిన్యూ చేయడం అంటే కాస్త కష్టమే అని తెలియజేస్తోంది మాధురి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో మీడియా ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంటుంది అందుచేతనే ప్రతి విషయంలో కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుందని తెలియజేస్తోంది మాధురి దీక్షిత్.

ఆన్ స్క్రీన్ అందంగా కనిపించడమే కాకుండా రెడ్ కార్పోట్స్ నుంచి ఎయిర్ పోర్ట్ లుక్ వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరూ జాగ్రత్త పడవలసి ఉంటుంది అని తెలియజేసింది ఆయన లైఫ్ లో ఇలాంటి కొత్త ఫేజ్ తనకు చాలా హ్యాపీగానే ఉందని తెలియజేస్తోంది మాధురి దీక్షిత్. ప్రస్తుతం ఏమి చేసిన కామెంట్స్ చాలా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: