డైరెక్టర్ మణిరత్నం ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రాన్ని ఒక నవల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో తమిళ నటలు నటించడం జరిగింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మణిరత్నం. వేలనాటి చోళుల కథ అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు మణిరత్నం. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.మరి ఈ సినిమాతో మణిరత్నం సక్సెస్ అయ్యారా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష జయం రవి, ప్రకాష్ రాజ్ తదితర నటీనటుల సైతం ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం పాన్ ఇండియా లేవల్ల ఒకేసారి ఐదు భాషలలో విడుదలైంది. ఈ చిత్రంలోని ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ సంగీతం కూడా ఈ చిత్రానికి ప్లస్గా నిలిచినట్లు తెలియజేశారు.
సినిమా చూసిన ప్రేక్షకుల సైతం బ్లాక్ బాస్టర్ హీట్ గా నిలిస్తుందని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా స్టోరీ లైన్ బాగుందని మ్యూజిక్ పరంగా ఎంత అద్భుతంగా ఉందని విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉన్నాయని తెలియజేస్తున్నారు. కానీ సినిమానే కాస్త స్లోగానే సాగుతోంది అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద ఐశ్వర్యరాయ్, త్రిష నటున ఎంతో అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు. స్క్రీన్ ప్లే మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే మణిరత్నం మరింత బాగుండు అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తమిళ్లులు అంతా ఇది గర్వపడే సినిమాల ఉందని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ నుండి షేర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఎట్టకేలకు మణిరత్నం ఈ సినిమాతో బాగానే ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: