దసరా పండుగ దగ్గరికోచింది. ఇక ఈ ఫెస్టివల్ వేళ కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఇక దీనికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు.టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున ఈ ఏజ్‌లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు.అయితే ఈ యేడాది 'బంగార్రాజు' మూవీలో తన తనయుడు నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ హిట్ అందుకున్నారు.ఇదిలావుంటే రీసెంట్‌గా ఈయన బ్రహ్మాస్త్ర' సినిమాతో పలకరించారు.

ఇక ఇపుడు 'ది ఘోస్ట్' మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు.అయితే  తాజాగా ఈ సినిమాను హిందీలో విడుదల చేయలనుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల కర్నూల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన అఖిల్, నాగ చైతన్య తన నాన్న నాగార్జున పాల్గొని ప్రమోట్ చేశారు.ఇదిలావుంటే ఇక 'ది ఘోస్ట్'కు ముందుకు “బ్రహ్మాస్త్ర” లాంటి భారీ పాన్ ఇండియా మూవీలో నటించాడు నాగార్జున. ఇక ఈ మూవీ వసూళ్ల తీరుపై ఆనందం వ్యక్తం చేశారు.అయితే  గత రెండేళ్లుగా వరుస సినిమాలతో నాగార్జున గ్యాప్ లెస్ గా శ్రమించారు.కాగా 'ది ఘోస్ట్' రిలీజ్ అయిన తర్వాత 3 నెలల పాటు నాగ్ విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం.

అయితే బంగార్రాజు- బిగ్ బాస్ నాన్ స్టాప్- ద ఘోస్ట్- బ్రహ్మాస్త్ర- ‘బిగ్ బాస్ తెలుగు 6’ ఈ 24 నెలల్లో ఆయన చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్ లు. ఇక ఇవన్నీ భారీగా శారీరక శ్రమతో పాటు మానసికంగా అలసిపోయేంత పెద్ద ప్రాజెక్టులు. అంతేకాదు ”పని నుండి నాకు కొంత విశ్రాంతి కావాలి. ఇక వచ్చే మూడు నెలల వరకు సినిమాల గురించి ఆలోచించను” అని నాగార్జున ఇటీవల ఒక సందర్భంలో అన్నారు.అయితే నాగార్జున 2023లో మాత్రమే కొత్త సినిమాలు చేయాలను కుంటున్నారు.ఇకపోతే అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర మూవీలో నాగార్జున అక్కినేని నందియాస్త్ర పాత్రలో కనిపించారు. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో నటిస్తారా ? లేదా? అనే దానిపైనా ఓపెనయ్యారు.అయితే పార్ట్ 2 లో కనిపిస్తానా? లేదా ?అనే దాని గురించి తాను ఏమీ చెప్పే స్థితిలో లేనని అన్నారు.సీక్వెల్ లో మంచి పాత్రలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు. ఇక 19 ఏళ్ల విరామం తర్వాత నాగార్జున హిందీ సినిమాల్లోకి తిరిగి ప్రవేశించారు. బ్రహ్మాస్త్ర సినిమాతో ఇది సాధ్యమైంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: