టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ,  మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చుకున్న సత్య దేవ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది. ఇలా మెగాస్టార్ చిరంజీవిమూవీ లో హీరోగా నటించడం ,  సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తార వంటి హేమా హేమీ నటులు ఇతర ముఖ్య పాత్రలో నటిస్తుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ 24 గంటల సమయం ముగిసే సరికి 9.04 మిలియన్ వ్యూస్ ని , 320 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: