తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం మూవీ తో వెండి తెరకు పరిచయం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బోళ్లమ్మా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. తాజాగా స్వాతిముత్యం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని మరియు వేదికను ఖరారు చేసింది. అక్టోబర్ 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక ,  మాదాపూర్ , హైదరాబాద్ లో  నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బెల్లంకొండ గణేష్ మరియు వర్షా బొల్లమ్మ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 5 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ టాలీవుడ్ ,  కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు భారీ మూవీ లతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: