పొడుగు కాళ్ళ సుందరి ఫారియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జాతి రత్నాలు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ మూవీ లో చిట్టి అనే పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటన తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇలా జాతి రత్నాలు మూవీ తో ఫుల్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి బంగార్రాజు మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ తన డాన్స్ తో ,  అందచందాలతో కుర్రకాలను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పొడుగు కాళ్ళ సుందరి మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రవణాసుర మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబందించిన పోటోలను పోస్ట్ చేసిన ఆ ఫోటోలు అనేక సందర్భాల్లో వైరల్ గా కూడా మారాయి. తాజాగా పొడుగు కాళ్ళ సుందరి ఫారియా అబ్దుల్లా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో శారీ ని కట్టుకొని ,  శారీ కి తగిన బ్లౌజ్ ని ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: