నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం క్రాక్ మూవీ తో అద్భుత మైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో శృతి హాసన్ ,  బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది . ఈ మూవీ కి ఇప్పటి వరకు మూవీ యూనిట్ టైటిల్ ని ఖరారు చేయలేదు . దానితో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడం తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది . 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ క్రేజీ దర్శకుల లో ఒకరు అయి నటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించ బోతున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి ,  బాలకృష్ణ మూవీ కి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ,  బాలకృష్ణ సినిమా డైలాగ్ లను మరియు స్క్రిప్ట్ నే ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ పై నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: