కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ కు ఎంత క్రేజ్ ఉందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక  టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే ఈ ఇద్దరు స్టార్లను ఇప్పటి వరకూ ఏ డైరెక్టర్ చూపించలేనంత డిఫరెంట్ గా చూపించాడు దర్శకుడు విష్ణు వర్దన్.ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ఆయన చేసిన పంజా సినిమా ప్లాప్ అయినప్పటికీ.. అదొక ఐకానిక్ మూవీగా మిగిలిపోయింది.అయితే  ఇప్పటికీ పంజాలో పవర్ స్టార్ స్టైల్ తో యూత్ కనిపిస్తుంటారు. ఇక సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పంజా మూవీ అలా నిలిచిపోయింది.

ఇకపోతే పంజా సినిమాకి గాని ఆ సినిమా దర్శకుడు విష్ణు వర్ధన్ టేకింగ్ కానీ పవన్ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ ప్లేస్ ఉంది.అయితే  అందుకే ప్లాన్ అని చూడకుండా డైరెక్టర్ విష్ణువర్థన్ తో మరో సినిమా కావాలంటూ పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ అడుగుతుంటారు.  ఆయన తమిళ్ డైరెక్టర్.. అక్కడ చాలా సినిమాలు చేశారు ముఖ్యంగా తల అజిత్ కు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు విష్ణు. ఇక అజిత్ సూపర్ హిట్ తమిళ్ మూవీస్ లో బిల్లా ఒకటి. అయితే ఈ పంజాలో పవన్ ను ఎంత డిఫరెంట్ గా చూపించాడో.. బిల్లాలో కూడా అజిత్ ను అంతే డిఫరెంట్ గా చూపించాడు విష్ణు.

ఇక తమిళ్ లో బిల్లా మూవీ కూడా ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ కాంబోలో అయితే మళ్ళీ ఇన్నాళ్లకు ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు అలాగే ఈ సినిమా ఓ భారీ పీరియాడిక్ సబ్జెక్ట్ తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఇక అజిత్ పాత్ర కూడా అంతకు మించి ఉంటుందని తెలుస్తోంది .కాగా  తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారట. ఇక  ఈమూవీ ఎలా ఉంటుందో చూడాలి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: